29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తడపాకల్ లో బడి బాట కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ఆశయ సాధనార్థం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని తడపాకల్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ ఏర్పాటు చేశారు. ఇట్టి సందర్భంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ మాట్లాడుతూ, తడపాకల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామం లో  ఈనెల 6 నుండి 19 వరకు అనేక విధాలుగా రోజు వారీ  షెడ్యూల్ విధానాలను అనుసరించి నిర్వహించడం జరుగుతుందని, అంగన్వాడి పాఠశాలల నుండి ప్రైవేట్ పాఠశాలల నుండి  ఇతర వర్గాల నుండి డ్రాప్ ఔట్  విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి గుణాత్మక విద్యను అందించడ మే లక్ష్యంగా పాటుపడడం జరుగుతుందనీ అన్నారు.  ఉపాధ్యాయుడు కృష్ణ ప్రసాద్, మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించినట్లయితే విద్యార్థుల ఉన్నత విద్య IIIT లలో, కార్పొరేట్ పాఠశాలలో రాయితీ దొరికే  ఆస్కారం ఉందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాద్యాయులు కృష్ణ ప్రసాద్, సుధాకర్, రాములు,స్వప్న,రవి,ఆనంద్, నవీన్,దేవానంద గౌడ్, భూపతి,చక్రపాణి , విజయ, పాల్గొన్నారు.

More articles

Latest article