25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జాగృతి సభ్యులతో ఎమ్మెల్సీ కవిత సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం మండలంలో పర్యటించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, జాగృతి సభ్యులతో సమావేశమై, పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా బాపునగర్ గ్రామంలో ఇటీవల వివాహం చేసుకున్న జాగృతి నాయకుడు రంజిత్ దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. అనంతరం కుర్నాపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్యెల్సి, మాజీ సర్పంచ్ మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ కుటుంబాన్ని కలసి రవీందర్ మనవడికి ఆశీస్సులు అందించారు. అదేవిధంగా, ముస్లిం నాయకులు మరియు కార్యకర్తలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, జాగృతి కార్యకర్తలు, అనేక మంది స్థానికులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత పార్టీ బలోపేతంపై దృష్టిసారించి కార్యకర్తలతో నేరుగా సంభాషించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

MLC Kavitha review with Jagruti members

More articles

Latest article