తడపాకల్ లో బడి బాట కార్యక్రమం

బతుకమ్మ,ఏర్గట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ఆశయ సాధనార్థం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని తడపాకల్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ ఏర్పాటు చేశారు. ఇట్టి సందర్భంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ మాట్లాడుతూ, తడపాకల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామం లో  ఈనెల 6 నుండి 19 వరకు అనేక విధాలుగా రోజు వారీ  షెడ్యూల్ విధానాలను అనుసరించి నిర్వహించడం జరుగుతుందని, అంగన్వాడి పాఠశాలల నుండి ప్రైవేట్ పాఠశాలల నుండి  ఇతర వర్గాల నుండి డ్రాప్ ఔట్  విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి...