. . . మ్రత్యు శకటాలుగా ఆటోలు, ప్రైవేటు వ్యాన్ లు
. . . కొన్ని బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ లు
. . . బడి ప్రారంభం వేళ పసి ప్రాణాలతో చెలగాటం
నిజామాబాద్, బతుకమ్మ :
విద్యార్ధుల తల్లిధండ్రులారా పారా హుషార్.. సోమవారం విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. మీ ఆశలు… మీ కలలు తీర్చే మీ చిన్నారులు.. మీ వారసులు ప్రయాణించు స్కూలు విద్యార్థులను తీసుకెళ్లె వాహనాలు ( బస్సులు, వ్యాన్ లు, ఆటోలు) భద్రమేనా అని పరిశీలించండి. ఫీట్ నేస్ (సర్టిఫికేట్) ఉంటేనే వాటిలో పిల్లలను బడికి ( స్కూల్స్ ) కు పంపండి. లైసెన్స్ కలిగిని అనుభవం ఉన్న డ్రైవర్లు నడుపుతున్న వాహనాలలోనే మీ పిల్లలను పంపండి. లేకపోతే వాటి వలన జరిగే ప్రమాదాలకు ఇటు విద్యా సంస్థలు చేతులేత్తేస్తాయి.. ఇక వేసవి సెలవులలో విద్యాసంస్థ ల వాహనాలను తనిఖీ చేయని రవాణ… విద్యార్ధులను తరలిస్తుండగా తనిఖీలు చేస్తామని ప్రకటన జారీ చేసింది..

మహా నగరాలతో పాటు జిల్లాల్లోనూ ఆటోలు చిన్న ప్రైవేటు వ్యాన్ లలో పిల్లలను స్కూల్ లకు చేరవేస్తున్నారు. ఓనర్లు కొద్ది పాటి లాభం కోసం సామర్థ్యానికి మించి ఊపిరి ఆడనంతగా విద్యార్థులను కుక్కి మరీ ప్రయాణాలు సాగిస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు ఎక్కాల్సిన ఆటోలో కనీసం 10 మందికి పైగా తీసుకెళ్తున్నారు. చిన్న పొరపాటు లేదా ప్రమాదం జరిగినా పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. స్కూల్ ఫీజుల విషయానికి వస్తే రూ.వేలకు వేలు రాజీ పడకుండా చెల్లించే తల్లిదండ్రులు పిల్లల ప్రయాణ భద్రతపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నా రని మింగుడుపడని ప్రశ్న తమ పిల్లలు వెళ్లె ఆటోలో ఓవర్ లోడింగ్ కారణంగా ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అదే వాహనాల్లో పంపించడం ముమ్మాటికి తల్లిదండ్రుల తప్పే. ఆటొలే కాకుండా స్కూల్ బస్ లలో విద్యార్ధులను కుక్కి తరలించడం ప్రైవేట్ స్కూల్ కు చెల్లింది. కార్పొరేట్ రేంజ్ లో ట్యూషన్ ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలు కుడా పిల్లలను పరిమితికి మించి తరలిస్తున్నాయి. రవాణా శాఖాధికారులు పిట్ నేస్, డ్రైవింగ్ లైసేన్స్ లు, ఇన్స్ రేన్స్ మాత్రమే తనిఖీ చేస్తు పర్మిట్ లను పరిశీలించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కాలం చెల్లిన వాహనాలను స్థానికంగా తిప్పుతున్న రవాణా శాఖ పట్టించుకోదని ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడి తనిఖీలు మినహ సీజ్ చేయడం అంటు ఉండదని దానికి అంతా కాసుల మహిమ అను అరోపణలు లేకపోలేదు…

ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున: ప్రారంభమవుతున్న సందర్భంగా రవాణా శాఖ రంగంలోకి దిగి నిబంధనలు ఉల్లంఘించే విద్యా సంస్థల వాహానాలపై చర్యలకు రవాణా శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25987 విద్యా సంస్థల బస్సులు ఉండగా ఇప్పటి వరకు 22158 బస్సులు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 625 బస్సులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 531 బస్సులు హైదరాబాద్ జిల్లాలో 165 బస్సులు ఇప్పటికీ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 250 కి పైగా బస్ లకు పిట్ నెస్ కాలేదని సమాచారం…

ఫిట్ నెస్ లేకుంటే సీజ్ చేస్తాం….. జేటీసీ చంద్రశేఖర్ గౌడ్
రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి విద్యా సంస్థలు పున : ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను ద్రష్టిలో ఉంచుకుని ప్రత్యేక డ్రైవ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని రవాణాశాఖ సంయుక్త రవాణా కమిషనర్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. విద్యార్థులను తీసుకెళ్లె అన్ని బస్సులు ఇతర వాహనాలు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఫిట్ నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని లేదంటే ఆ వాహనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. పరిమితికి మించి విద్యార్థుల్ని తీసుకెళ్లినా ఇతర భద్రతా ప్రమాణాల్ని ఉల్లంఘించినా యాజమాన్యాలు డ్రైవర్ లపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.. రూట్ పర్మిట్ , ఇన్సురెన్స్ , కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లు కూడా తప్పనిసరిగా ఉండాలని జేటీసీ స్పష్టం చేశారు. పరిమితికి మించి విద్యార్థుల్ని తీసుకెళ్లే వాహనాల్లో పంపించోద్దని తల్లి దండ్రులకు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
