24.1 C
Hyderabad
Monday, August 3, 2026

యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు రుద్రూర్, అంబం, రాణంపల్లి, అక్బర్ నగర్ గ్రామాలలో యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెరగడానికి క్రీడలు దోహదపడతాయని కోనేరు శశాంక్ పేర్కొన్నారు. క్రికెట్ కిట్ ను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ బృందం, ముదునూరి కృష్ణం రాజు, కటిక రామరాజు, నాగారం చిన్న సాయిలు, బేగరి వినోద్ కుమార్, ఆలపాటి హరికృష్ణ, ప్రశాంత్ గౌడ్, ఏముల గజేందర్, పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, బోజిగొండ అనిల్, చుండూరి రవితేజ, కుర్లెపు గంగాధర్, రేపల్లి సాయిప్రసాద్ పాల్గొన్నారు.

More articles

Latest article