వెబ్ న్యూస్, బతుకమ్మ : నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21 గా ప్రకటించింది. సెప్టెంబర్ 9 తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఎన్నిక జరగనుంది. కాగా, నూతన ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
