Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 1:40 pm Posted by : ramakrishna

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ :  నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం  విడుదల చేసింది. ఆగస్టు 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21 గా ప్రకటించింది. సెప్టెంబర్ 9 తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఎన్నిక జరగనుంది. కాగా, నూతన ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై  ఆసక్తి నెలకొంది.