‘‘బార్”అధ్యక్షునిగా సాయరెడ్డి ఏకగ్రీవం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ న్యాయవాది మామిల్ల సాయరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ ,ఎర్రం విగ్నేష్, బిట్ల రవి,మధుసూదన్ గౌడ్ తెలిపారు. నామినేసన్ల స్వీకరణ, పరిశీలన అనంతరం సాయరెడ్డి ఒకరే నామినేషన్ వేశారని,నామినేషన్ పత్రాలను పరిశీలించిన పిదప ,ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున ఆమోదించి అధ్యక్ష ఎన్నికను దృవీకరించినట్లు వారు తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి సురేష్, దిలీప్, ప్రధాన కార్యదర్శి పదవికి మానిక్ రాజు, భాస్కర్ రెడ్డి, బాలరాజ్ నాయక్, సంయుక్త...