25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

గుమ్మిర్యాల లో విద్యుత్ సమస్యను తీర్చిన సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . హర్షం ప్రకటించిన గ్రామ ప్రజలు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

గుమ్మిర్యాల్ గ్రామంలో విద్యుత్ సమస్యలు తరచూ ఏర్పడడంతో గ్రామ సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్ స్పందించి వెంటనే విద్యుత్ సమస్య తలెత్తకుండా నూతనంగా ఒక 100 కె.వి ట్రాన్స్‌ ఫార్మర్‌తో పాటు రెండు 25 కె.వి సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ ఫార్మర్ లను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ కిషోర్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామంలో తరచూ విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్న విషయాన్ని స్థానిక లైన్ మెన్ అష్రాఫ్‌కు తెలుపగా ఆయన వెంటనే సమస్యను పై అధికారులైన డిఎం రఘు, ఏడీఈ నాగేశ్వర్, ఏఈ సురేష్, దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్యపై వారు వెంటనే స్పందించి గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక 100 కె.వి, రెండు 25 కె.వి ట్రాన్స్‌ ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article