27.4 C
Hyderabad

పేద కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన పల్లపు రాజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజు పేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఆయన మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ విషయం తెలుసుకున్న తోర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేష్ మానవతా దృక్పథంతో స్పందించారు. అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని మృతుడి కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ భూమేష్, ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పేద కుటుంబానికి ఆపద సమయంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ కౌడ భూమేష్‌ను గ్రామ ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article