పేద కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన పల్లపు రాజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజు పేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఆయన మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ విషయం తెలుసుకున్న తోర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేష్ మానవతా దృక్పథంతో స్పందించారు. అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయాన్ని మృతుడి కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను...