30.9 C
Hyderabad
Monday, August 3, 2026

శబరిమాత ఆశ్రమ ట్రస్ట్ కమిటీ సర్వసభ్య సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: జిల్లాలోని తాడువాయి శ్రీ శబరిమాత ఆశ్రమంలో  ఆశ్రమ ట్రస్ట్ కమిటీ సర్వ సభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు అనంతరావు ఆధ్వర్యంలో ఆశ్రమ అభివృద్ధి, అన్నదానం,  అమ్మవారి నిత్య పూజా కార్యక్రమాల గురించి చర్చిస్తూ కొన్ని తీర్మానాలు చేశారు. శ్రీ శబరి మాతాజీ విజయదశమి రోజున మహా  సమాధి  దీక్షకు వెళ్లి  తిరిగి మాతాజీ  కార్తీక పౌర్ణమి రోజున దర్శనం ఇచ్చి భక్తుల యొక్క కోరికలను తీర్చే కొంగుబంగారమై విరాజిల్లుతుందని అధ్యక్షులు అనంతరావు తెలియజేశారు. అమ్మ భక్తులు, శిష్యులు  నిత్యాన్నదాన, ఆశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో  వారి వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని  భక్తులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గౌరవ అధ్యక్షులు  వేముల శంకరయ్య,   ఆశ్రమ ప్రధాన కార్యదర్శి  నేతి  కృష్ణమూర్తి, కోశాధికారి దూడం శ్రీనివాస్,  గ్రామ పెద్దలు బాలకిషన్ రావ్, రాఘవరెడ్డి, డాక్టర్ నరసింహులు, రనీల్ రెడ్డి, రామశంకర్, సాంస్కృతిక కార్యదర్శి  లక్ష్మీనారాయణ భరద్వాజ్, శంకర్, కట్ల వేణు, గడ్డం వేణు, మల్లేశం,  శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article