శబరిమాత ఆశ్రమ ట్రస్ట్ కమిటీ సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, బతుకమ్మ: జిల్లాలోని తాడువాయి శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఆశ్రమ ట్రస్ట్ కమిటీ సర్వ సభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు అనంతరావు ఆధ్వర్యంలో ఆశ్రమ అభివృద్ధి, అన్నదానం, అమ్మవారి నిత్య పూజా కార్యక్రమాల గురించి చర్చిస్తూ కొన్ని తీర్మానాలు చేశారు. శ్రీ శబరి మాతాజీ విజయదశమి రోజున మహా సమాధి దీక్షకు వెళ్లి తిరిగి మాతాజీ కార్తీక పౌర్ణమి రోజున దర్శనం ఇచ్చి భక్తుల యొక్క కోరికలను తీర్చే కొంగుబంగారమై విరాజిల్లుతుందని అధ్యక్షులు అనంతరావు తెలియజేశారు. అమ్మ భక్తులు, శిష్యులు నిత్యాన్నదాన,...