బతుకమ్మ, బోధన్ : సాలూర మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలను రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ, సమీప గ్రామాల్లోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆయన స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మచ్చందర్ రెడ్డి మందర్నా, హుంసా, ఖాజాపూర్ గ్రామాలను సందర్శించి, స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది ఒడ్డునకు వెళ్లకుండా, పిల్లలు, పశువులను కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు లేదా స్థానిక అధికారులకు సమాచారం అందించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. అవసరమైతే రక్షణ, సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిద్ధంగా గ్రామ వి పి ఓ సిబ్బంది మరియు ఎస్ఐ మచ్చందర్ రెడ్డి అందుబాటులో ఉంటామని తెలిపారు.
