సాలూర మండలంలో రూరల్ ఎస్సై పర్యటన
బతుకమ్మ, బోధన్ : సాలూర మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలను రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ, సమీప గ్రామాల్లోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆయన స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మచ్చందర్ రెడ్డి మందర్నా, హుంసా, ఖాజాపూర్ గ్రామాలను సందర్శించి, స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నది ఒడ్డునకు వెళ్లకుండా,...