హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవహార కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి తో ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపితం, పార్టీ అమలు చేస్తున్న విధి విధానాల గురించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజ్ ఏకాంతంగా సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాలలో, ప్రతి గ్రామాలలో వాడ వాడనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయనే విషయంపై చర్చించారు. ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఉచిత 200 యూనిట్ కరెంటు, రైతు భరోసా, వరి పంట బోనస్, మహిళలకు ఉచిత బస్సు,, 500 రూపాయలకే సిలిండర్, వంటి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి తెలియజేయాలని మీనాక్షి నటరాజన్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ని పటిష్టం చేయాలని రూరల్ ఎమ్మెల్యే కి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నజరాజన్ ను కలిసిన రూరల్ ఎమ్మెల్యే
