24 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయ రహదారి 161పై రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

. . . ఇద్దరు యువకుల దుర్మరణం

బిచ్కుంద, బతుకమ్మ :

జాతీయ రహదారి సంగారెడ్డి – జహీరాబాద్ జాతీయ రహదారి నెత్తురోడింది. జాతీయ రహదారి 161పై పెద్దకొడపగల్ మండలం పెద్దతక్కడపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. పెద్దతక్కడ్ పల్లి వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో ఒకరు వంశీ(24), కార్తీక్ (27)గా గుర్తించారు. ఇద్దరు కూడా బంధువుల పిల్లలే అని తెలిసింది. ప్రమాదానికి కారణమైన వాహనం గురించి ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం బైక్ ను ఢీకొట్టి  పరారీ అయినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు  రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పెద్దతక్కడపల్లిలో విషాదం నెలకొంది.

Road accident on National Highway 161

More articles

Latest article