బాన్సువాడ బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామ రైతులు రైస్ మిల్లు వ్యాపారుల వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం చౌరస్తా వద్ద బాన్సువాడ-బోధన్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఒక వైపు అకాల వర్షం మరో వైపు ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరుగు పేరుతో స్థానికంగా సుగుణ రై స్ మిల్ యాజమాన్యం దోపిడీ చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ తీరుపై, రైస్ మిల్లు వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతుల రాస్తారోకో గందరగోళం మారింది. తరుగు పేరుతో రైతులను దోచుకున్న సుగుణ రైస్ మిల్ యాజమాన్యం పై చర్యలు తీసుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు.

