తరుగు పేరిట రైస్ మిల్లర్ల దోపిడీ 

బాన్సువాడ బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామ రైతులు రైస్ మిల్లు వ్యాపారుల వేధింపులపై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం చౌరస్తా వద్ద బాన్సువాడ-బోధన్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఒక  వైపు  అకాల వర్షం మరో వైపు  ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంపై రైతులు కన్నెర్ర చేశారు.  తూకం వేసిన ధాన్యాన్ని తరుగు పేరుతో స్థానికంగా సుగుణ రై స్ మిల్ యాజమాన్యం దోపిడీ చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ...