24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు సహకరించాలని షబ్బీర్ అలీకి వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు సహకరించాలని కోరాయి.  షబ్బీర్ అలీ అనుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర ట్రెజరీ సెక్రెటరీ వినోద్ కు ఫోన్ చేసి సమస్యను తెలుసుకొని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారని తెలిపారు. షబ్బీర్ అలీకి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు ధన్యవాదాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో గురువేందర్ రెడ్డి, బాలాజి, దత్తు, సత్యం, విజయ్, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article