ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

0 1,300

ఇందల్వాయి,బతుకమ్మ:  ఇందల్వాయి మండల కేందలోని ఇందల్వాయి, వివిధ గ్రామాలలో  నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలు యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ నాయకులు లోకల్ గోపి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య  సమరంలో సాయుధ పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు – అది మనంతట మనమే తీసుకోవాలని చెప్పిన ఆ నేతాజీ అడుగుజాడల్లో అందరు నడుచుకొని భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిరక్షణ కమిటీ సభ్యులు లోకని గోపి,అశోక్ ప్రసాద్ భాస్కర్ దాసు,జెపి ప్రవీణ్,నవీన్,శంకర్,అరుణ్, శ్రీధర్,యువకులు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.