24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ముత్యాల చెరువు పున:నిర్మాణం చేయవద్దని ఎమ్మెల్యేకు వినతి

Must read

📰 Generate e-Paper Clip

  • భూగర్భ జలాలు ఉండేటట్టు  చేస్తామని ఎమ్మెల్యే హామీ

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : గత నెల 28న భారీ వర్షాల కారణంగా ఓన్నాజీ పేట గ్రామ శివారులో ఉన్న ముత్యాల చెరువు  (రిజర్వాయర్ ) తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ముత్యాల చెరును పునర్నిర్మానం చేయవద్దని చెరువు కింద ఉన్న గ్రామల ప్రజలు సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  రేకులపల్లి భూపతిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలతో ముత్యాల చెరువు తెగిపోవడంతో  బీరప్ప తాండ, మద్దుల తండా, వాడి, సీతాయిపేట్  తండా, సీతాయిపేట్,  కొండూరు, వాల్గొట్,  భీమ్గల్, గ్రామాలకు ఈ ముత్యాల చెరువు ఉండడం వలన చాలా నష్టం జరిగిందని, పంట నష్టం, ఆస్తి నష్టం,  పశువుల ప్రాణ నష్టం జరిగిందని  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి  వివరించారు. అలాగే ఇల్లు కూలిపోవడం, కరెంటు మోటార్లు ధ్వంసం కావడం, రోడ్డు ధ్వంసం కావడం, వంటివి జరిగినవన్నీ, పంట పొలాలు మళ్లీ సాగులోకి రాకుండా అయినావని వివిధ గ్రామాల కమిటీలు, వివిధ గ్రామాల ప్రజలు  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి తెలిపారు. ఈ రిజర్వాయర్ వల్ల  అన్ని గ్రామాలకు ప్రాణహాని ఉంది కనుక  నిర్మాణం చేయవద్దని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి విన్నవించుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ  ముత్యాల చెరువును పునః నిర్మాణం చేయడమా లేదా ఆపివేయడమా అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లతో రివ్యూ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ముత్యాల చెరువు కు మత్తడి నిర్మించి హాన్నాజీ పెట్ చెరువులు నిండేల ముత్యాల చెరువు కింద చెక్ డ్యాంలు కట్టి, వాటర్ ప్రెషర్ తగ్గేలా చేస్తామని దీంతో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వినతి పత్రం అందజేసిన వారిలో వాడి,బీరప్ప తాండ, మద్దుల తండా,  సీతాయిపేట్  తండా, సీతాయిపేట్,  కొండూరు, వాల్గొట్  ల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు   ఉన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కొత్త వెంకట్ రెడ్డి, గంగారెడ్డి, భాస్కర్, కొండూరు రమేష్, దండు నర్సయ్య, గజ్జల సంతోష్, లింగాపురం సాయిలు, సతీష్, చిన్న వాల్గాట్ విడిసి చైర్మన్ గంగారెడ్డి, కర్క రమేష్, కాటం నర్సయ్య, రవీందర్, గంగ మోహన్, సాయి కిరణ్, గంగాధర్, రామచందర్, గజ్జల రమేష్,ముస్తఫా,శివ లింగం,నవీన్ రెడ్డి తదితర  గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

More articles

Latest article