26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో ముస్లింలు సోమవారం మిలాద్‌-ఉన్‌-నబి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు.ఇస్లాం మత స్థాపకుడైన మహ్మాద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని ముస్లింలు ఏటా నిర్వహిస్తుంటారు.ఈ సందర్భంగా మసీదుల్లో మహ్మాద్‌ ప్రవకర్త, ఆయన చేసిన త్యాగాలు, సేవలను ఇమామ్‌లు ముస్లింలకు వివరించారు.మహ్మాద్‌ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన బోధనలను ఈ పర్వదినాన ముస్లింలు ఆచరించారు.బాన్సువాడ లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ, సంగమేశ్వర్ కాలోని, ఇస్లాంపురా, వీధితో పాటు పలు ప్రాంతాల్లో వున్న ముస్లింలు ఈ పండగను ఎంతో వైభవంగా నిర్వహించుకున్నారు.ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మజీద్ల నుంచి ప్రారంభమైంది. నడుస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ర్యాలీ ఆసాంతం మహ్మాద్‌ ప్రవక్తపై రచించిన గీతాలను ఆలపిస్తూ ముస్లింలు ముందుకు సాగారు. మజీద్ల నుంచి ప్రారంభమైన ర్యాలీ తాడ్కోల్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఇందిరా గాంధీ చౌరస్తా, మీదుగా నెక్ బిబి దర్గాకు చేరుకుంది.అనంతరం అక్కడ అంతా సమావేశమై పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ర్యాలీ సందర్బంగా పోలీసులు భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.

Milad-un-Nabi celebrations in full swing

More articles

Latest article