నాగిరెడ్డిపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను తరలించొద్దని వినతి

0 1,337

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను నాగిరెడ్డిపేట మండలం నుండి వేరే చోటికి తరలించొద్దని కోరుతూ రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లానింగ్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. మల్లారెడ్డి కి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2015 సంవత్సరంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రం సమీపంలోని మాల్ తుమ్మెద ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌలభ్యం కోసం అప్పటి ప్రభుత్వం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో అడ్మిషన్లు తక్కువగా జరుగుతున్నాయన్న సాకుతో కళాశాలను ఖాళీ చేసి ఇక్కడి విద్యార్థులను సిద్దిపేట్ జిల్లా తోర్నాలకు తరలించినట్లు తెలుస్తుందన్నారు. నాగిరెడ్డిపేటలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉండడంవల్ల కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల గ్రామీణ విద్యార్థులకు ఈ కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కళాశాలను వేరే చోటికి తరలించడం ద్వారా స్థానిక విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించలేక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర ఉన్నత అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను నాగిరెడ్డిపేట నుండి తరలించకుండా చర్యలు చేపట్టాలని మనోహర్ రెడ్డి వినతిపత్రంలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.