నాగిరెడ్డిపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను తరలించొద్దని వినతి

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను నాగిరెడ్డిపేట మండలం నుండి వేరే చోటికి తరలించొద్దని కోరుతూ రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్లానింగ్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. మల్లారెడ్డి కి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి...