27.5 C
Hyderabad
Friday, July 31, 2026

వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కేశవ ప్రసాద్ తెలిపారు. కళాశాలలో 8 ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రోఫెసర్, 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 18 మంది జూనియర్ రెసిడెంట్, 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల వెబ్ సైట్ లో చూడాలని కోరారు. ఈ నెల 17 నుంచి 20 వరకు సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 21న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.

More articles

Latest article