- రూ.5 కోట్లు డిమాండ్
- రిపోర్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, బతుకమ్మ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావుకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే అవి బైటపెడతా అంటూ నిరూప అనిల్ కుమార్ అనే మహిళతో కలిసి రిపోర్టర్ శ్యామ్ బ్లాక్ మెయిల్ చేసినట్లు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో జుక్కల్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు శ్యామ్ పై ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు. శ్యామ్ ను అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జ్ ముందు హాజరు పరిచారు. సదరు రిపోర్టర్ ఒక ఎమ్మెల్సీకి చెందిన ఛానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు.