29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ పేరు తొలగించి ఇందూరు పేరు పెట్టండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

ఇందూరు నగరంలోని 36వ డివిజన్‌లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమంద్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో నిజామాబాద్ పేరు తీసివేసి ఇందూరు పేరు పెట్టాలని కార్యక్రమం నిర్వహించారు. 36వ డివిజన్ పరిధిలోని షాపుల వద్ద ఉన్న ఇతర పేర్లు తొలగించి, చారిత్రకమైన  ఇందూర్ అనే పేరును ఉపయోగించాలని సూచించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఇందూరు అనేది కేవలం ఒక పేరు కాదు.ఇది ఈ ప్రాంత ప్రజల చరిత్ర, సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఇందూరు అనే పేరు ప్రజల గుండెల్లో ఉన్న గౌరవం అని ఎంఐఎం నాయకులు   ఇందూరు కాదు అంటూ చేసిన వ్యాఖ్యలను  మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను కించపరచడమే కాకుండా, ఈ ప్రాంత చరిత్ర పై దాడి చేసినట్లు అని తెలిపారు. ఇందూరు అనే పేరు మతపరమైన కాదు.ఇది శతాబ్దాలుగా ప్రజల నోట వినిపిస్తున్న చారిత్రక గుర్తింపు. ఆ పేరును వ్యతిరేకించడం అంటే, ఈ నేలపై జీవిస్తున్న ప్రజలు అవమానించినట్లే. ప్రజల భావాలను దెబ్బతీసే రాజకీయ వ్యాఖ్యలు గట్టిగా ఎదుర్కొంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్  మాస్టర్ శంకర్, దాత్రిక పరమేష్, బూరుగుల వినోద్‌లతో పాటు, 36వ డివిజన్ ఇంచార్జ్ మురళి కృష్ణ పాల్గొన్నారు.

Remove the name Nizamabad and replace it with Indore

More articles

Latest article