26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గర్భిణీ స్త్రీల నమోదును పకడ్బందీగా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గర్భిణీ స్త్రీలను వెంటనే నమోదు చేసేలా పకడ్బందీ గా ప్రణాళిక నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని గర్భిణీ స్త్రీల నమోదు తక్కువగా ఉన్న పిహెచ్ సీ ల సిబ్బంది సమీక్ష సమావేశమును సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ప్రతిరోజు గృహ సందర్శన చేసి ఉన్న జనాభానంతని హౌస్ హోల్డ్ రిజిస్టర్లో నమోదు చేసి కరెక్ట్ డాటా ను సేకరిస్తే రిపోర్టులు చేయడం సులువు అవుతుందన్నారు. జీరో చిల్డ్రన్, ఒక సంతానము, రెండవ సంతానం ఉన్న దంపతులను గుర్తించి అర్హులైన వారిని శాశ్వత, తాత్కాలిక కుటుంబ పద్ధతులకి ప్రోత్సహిస్తూ, కొత్తగా గర్భం దాల్చిన గర్భిణీ స్త్రీలను 12 వారాల లోపు వెంటనే నమోదు చేసేలా పకడ్బందీ ప్రణాళికతో చేయాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలను నమోదు తక్కువగా ఉన్న పీహెచ్సీ లైన ఎడపల్లి, సాలూరా, పెగడపల్లి, దేవగావ్, డోంకేశ్వర్, జక్రంపల్లి, వేల్పూరు, పీహెచ్సీల ఏఎన్ఎంలు, సూపర్వైజర్ స్టాప్, ఎమ్ఎల్ హెచ్ పి లను సమీక్షించారు. ఏఎన్ఎంలు వారి వెంట తెచ్చుకున్న హౌస్ హోల్డ్ రిజిస్టర్ లను ప్రత్యేకంగా వెరీపై చేశారు. ప్రతి 1000 జనాభాకు సుమారు 2 వరకు గర్భిణీ స్త్రీలు ప్రతి నెల నమోదు అవుతారని, ఆశాలందరూ వారికున్న వెయ్యి జనాభాలో కొత్తగా పెళ్లిళ్లు అయిన వారిని ఒక సంతానం ఉన్న వారిని నిత్యం పర్యవేక్షించినచో వారిలో ఎవరు ఎప్పుడు గర్భం దాల్చింది తొందరగా నమోదు చేయవచ్చు అన్నారు. మీ హౌస్ హోల్డ్ సర్వే రిజిస్టర్ లో కొత్తగా పెళ్లిళ్లు అయిన వారిని నమోదు చేస్తూ 49 సంవత్సరాలు దాటిన మహిళలని అర్హులైన దంపతుల జాబితా నుండి తొలగించాలన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఎల్ఎంపి రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకన్న, డి డి ఎం నారాయణ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్, డిహెచ్ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ రాము వివిధ పీ హెచ్ సీ ల, ఎం ఎల్ హెచ్పి లు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

 

Registration of pregnant women should be made mandatory.

More articles

Latest article