జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్, బతుకమ్మ: ఐదు సంవత్సరాలలోపు పిల్లల, మాతృ మరణాలను తగ్గించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం మాతృ మరణా లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగిన ముగ్గురు మాతృ మరణాలపై, ఒకటి నుండి ఐదు సంవత్సరాలలోపు జరిగిన చిన్నపిల్లల మరణాలు ఇంతవరకు పది జరగగా వాటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా ఈ మరణాలు జరగకుండా అవకాశం ఉన్న పరిస్థితులు ఏంటివి, ఏ మరణాలని మనం జరగకుండా ఉన్నతమైన సేవలు అందించి ఆపచ్చు, ఏ మరణాలని మనం సౌకర్యాలు పరిస్థితులను బట్టి ఆపలేక పోవచ్చు అనే వాటిపై సమీక్షించారు. ఏ మరణాలనైతే మనకి అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను అందించి రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి వారితో సంబంధాలను కొనసాగిస్తూ వాటిని భవిష్యత్తులో అట్లాంటి మరణాలు జరగకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బందికి సూచించారు. జిజిహెచ్ సూప రెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ మాతృ మరణాలు ,చిన్నపిల్లల మరణాలకు గల కారణాలను వివరిస్తూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందించే సేవలను అందరికీ ఎటువంటి మరణం జరగకుండా తగూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఎవరైతే వైద్య సిబ్బంది ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని చేసిన తర్వాత 24 గంటల్లోపు మరణం సంభవిస్తే వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చిన తర్వాత జరిగే ఏ మరణం అయినా డిఐఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రమేష్, డాక్టర్ అంజన, డి ఐ ఓ డాక్టర్ అశోక్ , డాక్టర్ సమత, గైనకాలజిస్ట్లు డాక్టర్ అరుణ రేఖ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్, డాక్టర్ నిరూప రెడ్డి, మత్తు వైద్యులు డాక్టర్ సుజయ్ కుమార్, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సుప్రియ, ఎస్ఓ రాజేశ్వర్, డి హెచ్ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు వివిధ పిఎస్సి ల నుండి వైద్యాధికారులు సూపర్వైజరి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
