24.1 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ కైట్ షాపులపై టాస్క్ ఫోర్స్ సిసిఎస్ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

  • 20 బెండల్స్ చైనా మాంజా పట్టివేత
  • రూ.10 వేల నగద పట్టివేత
  • ఇద్దరిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలో చైనా మాంజ విక్రయదారులపై టాస్క్ పోర్స్, సిసిఎస్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. నిజామాబాద్ ఇంచార్జీ కమీషనర్ సిందూ శర్మ ఆదేశాలతో సిసిఎస్ ఎసిపి నాగేంధ్ర చారీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ చౌక్ లో  శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. సాద్ కైట్ షాప్, ఎన్ కే కైట్ షాప్ లపై దాడులు నిర్వహించి ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 20 బెండల్స్ ల చైనా మాంజాతో పాటు  రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి స్థానిక రెండవ టౌన్ పోలీసులకు అప్పగించారు.

More articles

Latest article