29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కలెక్టర్ ను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి.వినయ్ కృష్ణారెడ్డిని శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను శాలువాతో సన్మానించి నోట్ బుక్స్ పెన్నులు అందజేశారు. ఇటీవల  ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని రాజ్ భవన్ లో జరిగిన  రక్తదాతల దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్నందుకు నిజాంబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ను సభ్యులను కలెక్టర్ అభినందించారు. 67 అత్యధిక సార్లు రక్తదానం చేసి గవర్నర్ నుంచి అవార్డు పొందిన గంగాధర్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కలిపే రవీందర్, జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబపూర్ రవీందర్,  అవార్డు గ్రహీత గదేవర్ గంగాధర్ ,మండల్ జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్లు అబ్బయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

More articles

Latest article