కలెక్టర్ ను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి.వినయ్ కృష్ణారెడ్డిని శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను శాలువాతో సన్మానించి నోట్ బుక్స్ పెన్నులు అందజేశారు. ఇటీవల ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని రాజ్ భవన్ లో జరిగిన రక్తదాతల దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్నందుకు నిజాంబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ను సభ్యులను కలెక్టర్ అభినందించారు. 67 అత్యధిక...