27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రేషన్ డీలర్ల కమిషన్ ఇప్పించాలంటూ రుద్రూర్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ  తహసీల్దార్ సురేందర్ నాయక్   కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుండి కమిషన్ రానందున అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఏప్రిల్, మే, జూన్ మాసంలో మూడు నెలల బియ్యాన్ని అత్యంత పాదదర్శకంగా జిల్లాలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా కమిషన్ విడుదల చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. కావున గతంలో ఒకేసారి విడుదల చేసినట్టుగా, ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే కమిషన్ విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  రేషన్ డీలర్లు  రాములు, ఎండి. సాజిద్, వేద వ్యాస్, నాగయ్య, సిహెచ్.శంకర్, నరేష్, ఎం.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article