29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

. . . ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శ్రమదానం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ప్రత్యేక చొరవతో సోమవారం నగరంలోని 41వ డివిజన్ వసంత్ నగర్ లో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్ తో పాటు నగర మేయర్ కూరగాయల ఉమారాణి, డిప్యూటి మేయర్ సల్మా తహ్ సీన్, కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఖాళీ స్థలాన్ని శ్రమదానంతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో శ్రమదానం అంశం లేనప్పటికీ, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ నగరంలో ప్రత్యేకంగా శ్రమదానం కారక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఖాళీ స్థలాలు కబ్జాకు గురి కాకుండా కాపాడుకోవాలని, తద్వారా ఆ స్థలాలను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్కులు, వాకింగ్ ట్రాక్ తదితర వాటి కోసం వినియోగించుకునేలా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రస్తుతం శ్రమదానం చేసిన సుమారు 10 వేల చదరపు గజాల మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించేందుకు సరిహద్దులను గుర్తిస్తూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఆహ్లాదాన్ని అందించేలా పూల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూజిత, స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Rapid progress with public participation
Rapid progress with public participation

More articles

Latest article