నిజామాబాద్ , బతుకమ్మ:
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ని మాజీ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ లో గణేష్ బిగాల ఆరోగ్య పరిస్థితి ని ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

గణేష్ బిగాల క్షేమం కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం…
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఇటీవల కారు ప్రమాదానికి గురైన ప్పటికీ భగవంతుని కృప, ప్రజల ఆశీర్వాదంతో క్షేమంగా బయటపడిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో, మాక్లూర్‌లోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి గణేష్ బిగాల ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు. అనంతరం నీలకంఠేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కారు ప్రమాదం నుంచి గణేష్ బిగాల గారు సురక్షితంగా బయటపడటం సంతోషకర విషయమని, భగవంతుని ఆశీస్సులు, ప్రజల అభిమానంతో ఆయన మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నుడా మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్, గాండ్ల లింగం, చింతకాయల రాజు, మాకు రవి, రమేష్,శివకుమార్, విఠల్, మధు, న్యాలం రమేష్, సన్నీ,మహేష్, నరేష్ గౌడ్, జింక,రాజు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

