25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యల సాధనలో రాజన్న కృషి ఎనలేనిది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఉపాధ్యాయ విద్యారంగ సామాజిక రంగ సమస్యల సాధనలో రాజన్న కృషి ఎనలేనిదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శంతన్ అన్నారు. సోమవారం ఆర్మూర్ లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య అధ్యక్షతన “డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రాజన్న రెండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి.శంతన్ మాట్లాడుతూ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను రెండు కండ్లుగా చూసేవాడని సంఘ కార్యక్రమాల విజయ వంతానికి తన శక్తి మేరకు కృషి చేసేవాడని, రాజన్న లేని లోటు తీర్చరానిదని, ఆయన ఆశయ సాధనకు మనందరం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు అనేకము నెలకొని ఉన్నాయని వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఇంకా పరిష్కారం కాలేవన్నారు. ఒకవైపు విద్యారంగం పటిష్టవంతం చేస్తామంటూనే మరోవైపు రకరకాల పేర్లతోటి పాఠశాలలను నెలకొల్పి విద్యా రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఇట్టి ప్రయత్నాలను విరమించుకోవాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని అన్నారు. ముఖ్యంగా జీవో నెంబర్ 25 ద్వారా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పేరుతో ముందుకు తీసుకొచ్చి ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్నారని దానిని వెంటనే ఉపసంహరించాలని అలాగే పిఆర్సి, డీఏ లను వెంటనే ప్రకటించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణస్వాప్నికుడు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరన్యమని, ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని బలంగా నమ్మిన వ్యక్తి రాజన్న అని కొనియాడారు. రాష్ట్ర కౌన్సిలర్ పి. విజయకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పి.దాసు, ఆర్.పెంటన్న, మదర్ తదితరులు మాట్లాడుతూ విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యంగా పర్యవేక్షత పోస్టులు డిప్యూటీ ఈవో, మండల విద్యాశాఖ అధికారులను తక్షణమే నియామకం చేపట్టాలని, విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఐక్య ఉద్యమాల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని దీనికై ఉపాధ్యాయులంతా ఐక్యంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ, పెన్షనర్ నాయకులు పి విజయరామరాజు, శ్రీధర్, రాజేందర్ గౌడ్, కాంతయ్య, టీజీవో నాయకులు రాజ గంగారం, డిటిఎఫ్ పూర్వ నాయకులు చాకులింగం, పూర్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు రాజన్న వారి మిత్ర బంధం, రాజన్న, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ గంగాధర్, రాజారామ్, భార్య సావిత్రి కుమారుడు రాము, కూతురు రజిత, వారి బంధు వర్గం, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గం వివిధ మండలాల బాధ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

Rajanna's efforts in solving problems are invaluable.

More articles

Latest article