బీజేపీ ప్రభుత్వం ఓట్లు దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగం 

0 1,541
  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

 

మద్నూర్, బతుకమ్మ: బీజేపీ ప్రభుత్వం ఓట్లు దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కప్పుకున్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. జుక్కల్ ఎమ్మెల్యే వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాట్లాడుతూ..యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రజల హక్కులను కాల రాస్తూ, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పి గద్దె దించే వరకు మన నాయకులు రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలుస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. మద్నూర్ మార్కెట్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.