ఘనంగా రాజా బహదూర్ జయంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  నేవూరి రెడ్డి (మాలీసు పటేండ్ల ) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  రాజా బహదూర్  156 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ  బహదూర్ వెంకట్రామ రెడ్డి (1869–1953) హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ (కొత్వాల్) గా పనిచేసిన ఒక ప్రసిద్ధ పోలీసు అధికారి అని అన్నారు.నిజాం పాలనలో, సాధారణంగా ముస్లింలు నిర్వహించే ఈ పదవికి నియమితులైన మొదటి హిందువు ఈయనే, ...