- లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం
- పూర్తి సహకారం అందిస్తాం
- మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణం లోని మల్లారెడ్డి చెరువు లో గల చెత్తాచెదారాన్ని తొలగించి మురికి నీరుతో నిండిపోయిన చెరువును సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఢిల్లీ నుండి వచ్చిన లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పనులు ప్రారంభించారు. గతంలో మల్లారెడ్డి చెరువు నుండి నీటి యొక్క ఘాడత తెలుసుకోవడం కోసం శాంపిల్స్ ని సేకరించడం జరిగింది. శుక్రవారం చెరువు యొక్క శుద్ధి కరణ పనులను ప్రారంభించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది బయటకు తీయడం జరిగింది .ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ కొరకు ఆర్మూర్ మున్సిపల్ కట్టుబడి ఉందని ప్రజల అవసరాల కోసం మరియు నీటి వలన ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉండేందుకు లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ వారితో చెరువు శుద్ధికరణకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. చెరువు పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలు చెత్తాచెదారాన్ని చెరువులో పడెయ్యకుండా మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు చెత్తను మున్సిపల్ వాహనంలో పడేయాలని సూచించారు .మురికి నీరు చెరువులోకి రాకుండా దారి మళ్లించే దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సైంటిస్ట్ అవంతి ఆచార్య మరియు వారి బృందం, ఆర్మూర్ వైస్ మున్సిపల్ చైర్మన్ మున్ను, స్థానిక కౌన్సిలర్లు ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

