జాతీయ స్థాయిలో విద్యార్థులకు బహుమతులు 

0 1,199

బతుకమ్మ, ఏర్గట్ల: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, రాష్ట్రస్థాయిలో సాహిత్య పరిషత్ సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులనుఏర్గట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి,ఉపాధ్యాయ బృందం అభినందించారు.తెలుగు సాహిత్య అకాడమీ,  తెలంగాణ ప్రభుత్వం వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో వ్యాసరచన మరియు కథ రచనలో మొదటి బహుమతి, తెలంగాణ సాహిత్య పరిషత్ వారు నిర్వహించిన జాతీయస్థాయి సాహిత్య పోటీలలో వచన కవిత, ఉపన్యాసం, ఏకపాత్రాభినయం, కథల పోటీలలో మొదటి బహుమతి పొందిన అభిలాష్, రాజేష్, రూపక్, నవదీప్, వైష్ణవి,రిశ్వంత్ మొదలైన విద్యార్థులను, సాహిత్య రంగంతో పాటు కరాటే రంగంలో తమ ప్రతిభను చూపెడుతున్న 8వ తరగతి విద్యార్థి నూనె శ్రీనిధి కీ బాలరత్న పురస్కారం లభించినందుకు, విద్యార్థులను పాఠశాల బృందం అభినందించడం జరిగింది.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుండాలని,ఏర్గట్ల పాఠశాలకు గ్రామానికి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకురావాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.జాతీయ రాష్ట్రస్థాయిలో చక్కని బహుమతులు సంపాదించిన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి పేరును సంపాదించాలని తెలిపాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయలు మునీరుద్దీన్,ప్రసాద్,పవన్, రాజశేఖర్,విజయ్, రాజనర్సయ్య,రాజేందర్, ప్రవీణ్ శర్మ,గంగాధర్, శ్రీనివాస్, గంగా మోహన్,నరేష్, ట్వింకుల్,జ్యోతి,సబిత, సమత, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.