24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పేద కుటుంబానికి ముత్యాల సునీల్ రెడ్డి ఆర్థిక సాయం

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న మండల కేంద్రానికి చెందిన అష్రాఫ్ బీ అనే వృద్ధురాలికి ఇటీవల కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయించారు. అష్రాఫ్ బీ ఇబ్బందుల్లో ఉన్న విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని నాయకుల ద్వారా పంపించారు. ఆర్థిక సహాయం అందజేసిన సునీల్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్  నాయకులు, కార్యకర్తలు, అష్రఫ్ బీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, మూస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, గుండ్ల మహేశ్, కూరాకుల బోర్రన్న తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article