29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఆర్మూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని వెల్మల్, మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి  వద్ద వడ్లని శనివారం పరిశీలించారు. గత 25 రోజులు నుంచి వడ్లు ఆరబెట్టి కుప్పలు చేసిన ఇప్పటివరకు ఫోటోల కోసమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ఒక బస్తా కూడా ప్రభుత్వము తూకం వేయలేదని అన్నారు. రైతులు గత్యంత లేని పరిస్థితిలో ప్రైవేటు దళారులకు అమ్ముతు న్నారని  తెలిపారు. వెంటనే యుద్ధ ప్రతిపాదికన జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి తూకాలు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  నిజామాబాద్ బిజెపి జిల్లా సెక్రెటరీ గంగోని సంతోష్, నందిపేట్ కిసాన్ మోర్చా నంధిపేట్ మండల ప్రధాన కార్యదర్శి. ఉద్గిరి రవి, బీసీ మోర్చా అధ్యక్షుడు భూమేష్ గంగాధర్ మల్లేష్ మహిళా రైతులు రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article