నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : అధికారం లేకున్నా దుబ్బాక అభివృద్దే తన లక్ష్యం అని నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని మొండి చింత నుండి బేగంపేట వరకు గల రోడ్డును శనివారం నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు . అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ నుండి వచ్చే ఉప్పరపల్లి కాలువ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను కోనాపూర్ గ్రామంలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. రానున్న నాలుగు నెలల్లో మండల వ్యాప్తంగా నూతన రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
