27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనివ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అదనపు కలెక్టర్ అంకిత్
  • ప్రజావాణికి 135 ఫిర్యాదులు

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో పాటు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్ రావు లకు అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article