సావిత్రిబాయి పూలే కు పీఆర్ టీయూ తెలంగాణ నిజామాబాద్ ఘన నివాళి
నిజామాబాద్, బతుకమ్మ : మన భారతీయ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జన్మదినం సందర్బంగా పీఆర్ టియూ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృపాల్ సింగ్ సోడి, కనకపురం రవీందర్ లు పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సావిత్రి బాయి జయంతి ని మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించినందు కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అణిచివేయబడిన వర్గాలను న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆమె...