బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

0 8,857

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని గూపన్ పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. సిరికొండ మండలం దుప్య తండాకు చెందిన మాలవత్ రమేష్ గత 10 నెలల క్రితం తన పొలంలో పనిచేస్తూ ఉండగా పొలంలో కరెంట్ షాక్ తగిలి మరణించాడు. మాలవత్ రమేష్ మరణించిన విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ద్వారా నిజామాబాదు రూరల్ క్యాంపు కార్యాలయంలో 5 లక్షల చెక్కును అతని భార్య మాలవత్ నీల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, దుప్య తండా సర్పంచ్ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.