బోధన్, బతుకమ్మ : బోధన్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ని అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బోధన్ అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. వెంటనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పై విధించింది సస్పెండ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, బి ఆర్ ఎస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం,యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్,నక్క లింగారెడ్డి, రవి శంకర్ గౌడ్,ప్రవేన్ నాయక్,నసీర్ పటేల్, హైమద్,ఇంతియాజ్,జాగృతి యూత్ ఐకాన్ అల్లాడి దేవా,కన్ను తదితరులు పాల్గొన్నారు.
