24 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి,నిజామాబాద్ మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ మారా చంద్ర మోహన్ మాట్లాడుతూ,కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రాంత బిజెపి ఎంపీలు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ,ఇద్దరు కేంద్ర మంత్రులగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్రు అయిన కూడా  ఎంపి అరవింధ్ గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ,మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని వాగ్ధానం చేశారని తెలిపారు. దాన్ని గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదన్నారు. ఏదైతే మా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ప్రకటించిందో దాని నేనే తీసుకొచ్చిన అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గొప్ప చెప్పుకుంటాడని అన్నారు. ఎక్కడైతే బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడే అధిక ప్రాధాన్యత ఇచ్చరని తెలిపారు. అట్లనే ఎలక్షన్లు బీహార్ లో గాని ఢిల్లీలో గాని ఇదేకాక పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ కేటాయించారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిర్ధపల్లి సాయి రెడ్డి,మార్కెట్ యార్డు చైర్మన్  సాయి బాబా గౌడ్,ఆర్మూర్ ,నందిపేట్ మక్లూర్,డొంకేశ్వర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి,మంద మహిపాల్, రవి ప్రకాష్,భూమేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇస్సపల్లి జీవన్,నిజామాబాద్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్  ఇంద్రుడు,డైరెక్టర్ డిసిసి డెలిగేట్ దేగం గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్, లింగ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖoదేశ్ శ్రీనివాస్ ,పెర్కిట్ సొసైటీ చైర్మన్ భోజ రెడ్డి, కౌన్సిలర్లు రవి గౌడ్ ,ఇంతియాజ్ అతిక్, ఫయాజ్, రెహమాన్ ,యూత్ కాంగ్రెసు నియోజవర్గ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్,ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్,ఆర్మూర్ మండల అధ్యక్షులు రాకేష్,మాక్లూర్ మండల అధ్యక్షులు వినోద్ ,నిఖిల్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article