28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

డైరీ ప్రకారమే ప్రొటెక్షన్

Must read

📰 Generate e-Paper Clip

  •  ఎన్ పీడీసీఎల్ సిఎండి ఆదేశాలు 
  •  అసోసియేషన్లను కట్టడి చేసేందుకే
  •  ఫస్ట్ కం ఫస్ట్ తో చివరి వారికి అన్యాయం

 నిజామాబాద్ బతుకమ్మ :  విద్యుత్ శాఖలో బదిలీల సందడి నెలకొన్న దృష్ట్యా ప్రొటెక్షన్ కోసం అసోసియేషన్లు వెంపర్లాడుతున్నాయి.  ప్రతి సంవత్సరం బదిలీల సమయంలో తమ వారికి స్థానికంగా ఉండేందుకు అసోసియేషన్లలో కార్యదర్శి, అధ్యక్షుడు అంటూ ఎస్ఈ కి ఇచ్చి ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు.  దీనివల్ల వేరే వారికి అన్యాయం జరుగుతోంది. ఒక మహిళ తనకు సంఘం నుంచి ప్రొటెక్షన్ కోసం ఇవ్వాలని ప్రాధేయపడినప్పటికీ ఆమెకు ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు సర్కిల్ లో ఉన్న ప్రతి అసోసియేషన్ లో జరుగుతున్న వ్యవహారమే.

 డైరీ ప్రకారమే..

ప్రస్తుత బదిలీల విషయంలో కంపెనీ సీఎండి కట్టిన నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా అసోసియేషన్ల ఆగడాలకు కళ్లెం వేసేందుకు డైరీ ప్రకారమే ఇద్దరిలో ఒకరికి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడుగా తప్పనిసరిగా డివిజన్లను దాటాల్సిందేనని ఉత్తర్వులలో పేర్కొన్నారు. సిఎండి నిర్ణయాల వల్ల  అసోసియేషన్  బాధ్యులకు మింగుడు పడకుండా పోయింది. గతంలో లాగే ఈసారి తమ వారికి  సంఘపరంగా ప్రొటెక్షన్ ఇప్పించుకుందామని అనుకున్న వారి ఆటలు సాగకుండా పోయాయి.

  •  కట్టడి చేసేందుకే ..

సర్కిల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సంఘాలు గత కొన్నేళ్లుగా బదిలీలపుడు ప్రొటెక్షన్ను కోరుతూ తమ అనునాయులను కాపాడుకుంటున్నారు. దీనివల్ల దూర ప్రాంతాల వారు కేంద్రానికి రాలేకపోతున్నారు. కింది స్థాయిలో జరుగుతున్న విషయాలను  గ్రహించిన సిఎండి, ముందుగా సంఘాలను కట్టడి చేయాలనుకున్నారు. అసోసియేషన్లు తయారు చేసుకున్న డైరీలను ఆధారంగా చేసుకొని ఒకరికి ప్రొటెక్షన్ ఇవ్వాలని సర్కిల్ ఎస్ ఈ లకు ఆదేశాలు ఇచ్చారు.

 ఫస్ట్ కం ఫస్ట్ తో  అన్యాయం 

బదిలీలు ప్రస్తుతం వెబ్ ఆప్షన్ లో జరగనున్నాయి. జాబితాలో ముందు వరుసలో ఉన్నవారు ముందుగా ఆప్షన్స్ ఇస్తున్నారు. దీనివల్ల వారి బదిలీలు  సమీపంలోనే ఉంటున్నాయి. చివరి వారు కనీసం జిల్లా కేంద్రానికి దగ్గరికి రాలేకపోతున్నారు. ఎప్పటికీ మా పరిస్థితి ఇంతేనా అని దూర ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ఏఈలు 39, ఏడీలు 10 మంది బదిలీ కానున్నారు. నిజామాబాద్ డివిజన్లో 23 జే ఏ ఓ లు, సీనియర్ అసిస్టెంట్లు 32, జూనియర్ అసిస్టెంట్లు 41, రికార్డు అసిస్టెంట్లు ఐదుగురు, అటెండర్లు 12, ఫోర్ మెన్లు 9, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 14, సబ్ ఇంజనీర్లు 35 మంది బదిలీ కానున్నారు.

More articles

Latest article